వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు జోరందుకున్నాయి. గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల్లో అధికారులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. లంక గ్రామాల్లో ఉండిపోయిన వారి కోసం మంచినీరు, బియ్యం, కూరగాయలు పడవల ద్వారా తరలించారు.అధికారులు వాటిని గ్రామస్థులకు అందజేశారు. వరదల కారణంగా పంటలు పూర్తి స్థాయిలో పాడైపోయాయని... రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 50 నుంచి 80 వేల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి నష్టపోయామని వాపోయారు. వరద నీటి కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు.. ఇప్పుడిప్పుడే కొన్ని గ్రామాలకు పునరుద్ధరిస్తున్నారు. లైన్లన్నీ తనిఖీ చేసి కరెంటు సరఫరా కోసం చర్యలు చేపట్టారు.
లంక గ్రామాల్లో జోరుగా సహాయక చర్యలు - lanka villages
గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల్లో.. వరద కారణంగా రహదారులు నీటిలో కలిసిపోయాయి. అధికారులు పడవలతో సహాయ చర్యలు చేశారు.
లంకగ్రామాలకు మొదలైన సహాయక చర్యలు