వరద నీటిని నిల్వా చేసుకునే పరిస్థితి లేక కృష్ణా నది నీటిని సముద్రంలోకి వదివేస్తున్నారు అధికార్లు. ఎగువ నుంచి వస్తోన్న వరద నీటితో శ్రీశైలం,నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీ ఎత్తున ప్రకాశం బ్యారేజ్ కి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు నీటిపారుదల శాఖ అధికార్లు. ఇవాళ రాత్రికి మరో 5లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు బ్యారేజ్ నుంచి వరద ప్రవాహాన్ని దిగువ ప్రాంతానికి వదలుతామని వారు వెల్లడించారు. పెద్దఎత్తున నీటి విడుదల దృష్ట్యా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార్లు హెచ్చరికలు జారీ చేశారు. 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సముద్రంలో కలిసే దిశగా సాగుతోందని అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి ప్రవాహాంగా దిగువన వెళ్తోన్న నీటిని చూడటానికి ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. భారీ సంఖ్యలో సందర్శకుల రాకతో ప్రకాశం బ్యారేజ్ పై వాహనాలు నిలిచిపోయాయి.
కృష్ణా వరద నీటిని సముద్రంలోకి వదిలివేస్తోన్న అధికార్లు - గుంటూరు
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తోన్న వరద నీటిని నిల్వా చేసుకునే పరిస్థితి లేక ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని వదిలివేస్తున్నారు అధికార్లు. 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన అధికార్లు ఇవాళ రాత్రి మరో 5 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతామని వెల్లడించారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.
నిండుకుండను తలపిస్తున్న ప్రకాశం బ్యారేజ్