గుంటూరులో అక్రమంగా నిల్వ ఉంచిన వెయ్యి బస్తాల ప్రజాపంపీణి వ్యవస్థ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంటు అధికారులు సీజ్ చేశారు. జిల్లాలోని ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్ గ్రామానికి చెందిన దేవేళ్ల వెంకట్టేశ్వర్లుకు చెందిన గోదాములో.. రేషన్ బియ్యం నిల్వ ఉందనే ముందస్తు సమాచారంతో అధికారులు దాడి చేశారు. బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఫిరంగిపురం తహసీల్దారు సాంబశివరావు పాల్గొన్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 1000 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - ఫిరంగిపురం మండలం వార్తలు
గుంటూరులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోదాములో బియ్యం బస్తాలు ఉన్నాయనే ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించారు.
రేషన్ బియ్యం