గుంటూరు జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద మూడో నంబర్ ప్రమాద సూచిక జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో ప్రమాద సూచికను పోర్ట్ అధికారులు ఎగురవేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు వెనక్కి రావాలని హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు.
నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద మూడో నంబర్ ప్రమాద సూచిక - గుంటూరు జిల్లాలో వాతావరణం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి.. తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే కుండపోత వర్షం కురుస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద అధికారులు మూడో నంబర్ ప్రమాద సూచికను జారీ చేశారు.
నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్