బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గుంటూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షాలకు ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొలాల్లో వర్షపు నీరు నిలవటంతో మిర్చి, పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు మిర్చి మెుక్కలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడికొండ, మెడికొండూరు, కొర్రపాడు, పాలడుగు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇళ్లల్లో నీరు చేరటంతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు.
గుంటూరులో భారీ వర్షం... ఆందోళనలో రైతులు - గుంటూరు వర్షం వార్తలు న్యూస్
గుంటూరు జిల్లావ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పొలాల్లో వర్షపు నీరు చేరటంతో, పంటలు పాడవుతాయామోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరులో భారీ వర్షం