జిల్లాలో గడచిన 24 గంటల్లో సగటున 4.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చిలకలూరిపేటలో 60.8, నాదెండ్ల 29.6, తెనాలి 29.4, పొన్నూరు 28.6, ఎడ్లపాడు 24.2, అమృతలూరు 20.4, కొల్లూరు 13.6, చుండూరు 12.4, వేమూరు 6.6, శావల్యాపురం 6.4, దుగ్గిరాలలో 4.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా మంగళగిరిలో 3, వినుకొండ 2.8, కొల్లిపర 2.6, తుళ్లూరు 2.2, గుంటూరు 2, రేపల్లె 2, పెదకాకాని 1.4, తాడేపల్లి 8, చెరుకుపల్లి 4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తొలకరి పలకరింపుతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.
విస్తారంగా వర్షాలు... వ్యవసాయ పనుల్లో అన్నదాతలు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం పాతం నమోదైంది.
విస్తారంగా వర్షాలు