ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Heavy Rains in Andhra Pradesh: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Rains in Andhra Pradesh: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపునీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో వర్షపు నీటికి రహదారులు జలమయంగా మారాయి. ఇళ్లల్లోకి నీరు చేరిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 8:57 PM IST

Abundant rains in Andhra Pradesh  Overflowing streams and bends
Abundant rains in Andhra Pradesh Overflowing streams and bends

Heavy Rains in Andhra Pradesh: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Heavy Rains in Andhra Pradesh Overflowing Streams and Bends:అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు వివిధ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోగా...రహదారులపైకి వరద నీరు చేరింది. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Penna Flowing High: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నది: రాష్ట్రంలో రెండురోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మన్యం జిల్లా పార్వతీపురంలో భారీ వర్షానికి బైపాస్ కాలనీ ముంపునకు గురైంది. సమీపంలోనే రైల్వేట్రాక్ పనులు జరుగుతుండటంతో... వర్షపు నీరు వెళ్లే మార్గం లేక కాలనీని ముంచెత్తింది. వీధుల్లోకి మురుగునీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు పోటెత్తడంతో పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సిద్ధవటం వద్ద పాత వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. పాత వంతెన పైనుంచి రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. కడపలోని బుగ్గవంక డ్యామ్, ఆది నిమ్మాయిపల్లె ఆనకట్ట డ్యాం లోకి భారీగా వర్షపు నీరు చేరింది.

IMD issues Orange Alert in Coastal Andhra: కోస్తాంధ్రకు ఆరెంజ్​ హెచ్చరిక.. రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

Old Woman Died in Old House Collapse: రాయలసీమ జోన్ ఎస్​ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా: కర్నూలు జిల్లాలో రెండురోజులుగా కురస్తున్న వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా రాయలసీమ జోన్ ఎస్​ఐ (SI) అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేశారు. జోరుగా కురుస్తున్న వానలతో నంద్యాల జిల్లా కవులూరులో మట్టి మిద్దె కూలి వృద్ధురాలు మృతి చెందింది. గ్రామానికి చెందిన గొల్ల నాగమ్మ ఇల్లు కూలడంతో మట్టి మీద పడి నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడే ఉన్న శివ నాగమ్మ అనే మరో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన శివ నాగమ్మను ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా గంగవరంలోవర్షపు నీటికి రహదారులు జలమయంగా మారాయి. ఇళ్లల్లోకి నీరు చేరిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Rains in Andhra Pradesh: రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు: వాతావరణ శాఖ

వాగులో గల్లంతైన వ్యక్తి మృతి: ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోళవీడు గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమయింది. కంభం మండలం తురిమెళ్ళ గ్రామానికి చెందిన షేక్ మొహమ్మద్​గా గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ద్విచక్ర వాహనంపై గుండ్లకమ్మ వాగు దాటుతుండగా షేక్ మొహమ్మద్ వాగులో గల్లంతయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. చీకటి పడటంతో మంగళవారం ఉదయం మరో మారు పోలీసు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వాగులో కొట్టుకుపోయిన షేక్ మొహమ్మద్ కొద్ది దూరంలోని గుండ్లకమ్మ వాగులో శవమై తేలాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టంకి తరలించారు. గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Boy Was Dead in Culvert at Hyderabad : బాచుపల్లి వద్ద నాలాలో గల్లంతైన బాలుడు మృతి..

ABOUT THE AUTHOR

...view details