భారీ వర్షంతో నీటమునిగిన పత్తి పంట గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు , పొన్నూరు మండలాల్లో భారీ వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పొలాల్లో నీరు నిలిచిపోయింది. పత్తి మొక్కలు నీటమునిగాయి. కాకుమాను మేజర్ కాల్వలో వర్షపు నీరు నిండుగా ప్రవహించింది. రైతులు పొలాలోని నీటిని బయటకు పంపుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరువాత అతి భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి. పత్తి మొక్కలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్లోని ఆట మైదానాలలో వర్షపు నీరు నీలిచి చెరువులను తలపించాయి. నిన్నటివరకు ఒక్క చుక్క నీరు లేని నల్లమడ వాగులో వర్షపు నీరు ప్రవహిస్తోంది.