గుంటూరు జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షం రైతులను నిండా ముంచింది. బాపట్ల, రేపల్లె, పొన్నూరు, వేమూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ఇరవై వేల ఎకరాల్లో వరిపంట నేలవాలి నీట మునిగింది. నిజాంపట్నంలో 101 మి.మీ వర్షపాతం నమోదు కాగా రేపల్లె, బాపట్ల, కర్లపాలెం, నగరం, చెరుకుపల్లి, పిట్టలవానిపాలెం మండలాల్లో ఐదు సెం.మీ.కు పైగా వర్షం కురిసింది. నేలవాలిన వరిపైరును పైకి లేపి కట్టటానికి కూలీలకు ఎకరాకు రూ.3 నుంచి 4 వేలు చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
గుంటూరు జిల్లాలో భారీ వర్షం..ఆందోళనలో రైతులు - గుంటూరు తాజా వార్తలు
గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షం రైతన్నకు కంటనీరు మిగిల్చింది. సుమారు 20 వేల ఎకరాల్లో వరిపంట నేలవాలి నీట మునిగింది. మరో రెండు రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే పంటలపై పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు.
గుంటూరు జిల్లాలో భారీ వర్షం..ఆందోళనలో రైతులు