గుంటూరు జిల్లా పొందుగుల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. నిన్నటి ఘటన దృష్ట్యా పొందుగుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఏపీలోకి అనుమతించడం లేదని నిన్న పోలీసులపై ప్రయాణికులు రాళ్లు రువ్విన విషయం తెలిసిందే. పొందుగుల వద్ద ముళ్లకంచె ఏర్పాటు చేసి పోలీసులు భద్రతను పెంచారు. సరకు రవాణా వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. కూరగాయల వాహనాలనూ అనుమతి పత్రాలుంటేనే పంపిస్తున్నారు.
గుంటూరు జిల్లా పొందుగుల వద్ద ప్రశాంతం
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద కృష్ణానది వంతెన దగ్గర ప్రశాంత వాతావరణం నెలకొంది. నిన్న జరిగిన ఘటన దృష్ట్యా పోలీసులు రాత్రి నుంచి పకడ్బందీ చర్యలు ప్రారంభించారు. వాహనాలు, ప్రజలను రాష్ట్రంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోకి రావాలంటే వైద్య పరీక్షలు తప్పనిసరి అని తేల్చి చెబుతున్నారు.
గుంటూరు జిల్లా పొందుగుల వద్ద ప్రశాంతం