Heavy Loss to Farmers Due to Michaung Cyclone Effect:మిగ్ జాం తుపాన్ నష్టం రైతులను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఖరీఫ్‌లో వరి కోతలు పూర్తైన తర్వాత కృష్ణా జిల్లా రైతులు అధికంగా మినుమును సాగుచేస్తుంటారు. వరి కోతలు ముందే పూర్తైన ప్రాంతాల్లో మినుము విత్తనాలు జల్లుకున్నారు. బస్తాకు 11 నుంచి 12 వేల రూపాయలు వెచ్చించి సాగుకు సిద్ధమయ్యారు. మొక్కలు సైతం అర అడుగు పెరిగాయి. ఈ లోగా వచ్చిన తుపాను మినుమును పూర్తిగా తుడిచిపెట్టేసింది. పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. నానా తిప్పలు పడి వర్షపు నీటిని బయటకు పంపినా మొక్క ఎదుగుదల కనిపించటంలేదని వాపోతున్నారు.
మిగ్‌జాం తుపానుతో వేల ఎకరాల్లో కూరగాయల పంటలకు తెగుళ్లు- ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అన్నదాతల వేడుకోలు
గతంలో మినుము విత్తనాలు చల్లిన తర్వాత మెక్క ఎపుగా ఎదిగేందుకు పురుగు మందులు కూడా కొట్టామని రైతులు అంటున్నారు. అటూ వరి పంటను కొల్పోయి ఇటూ మినుము పంటను కొల్పోయి తాము సాగులో చాలా నష్టపోయామని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మినుములు క్వింటా 15 వేల నుంచి 16 వేల వరకు ధర చెబుతున్నారని, మళ్లి అన్ని డబ్బులు పెట్టి మినుము విత్తనాలు కొనుగోలు చేయాలంటే తమకు తలకు మించిన భారంగా మారుతుందన్నారు. 15 వేలు ఖర్చు చేసి మినుము విత్తనాలు కొని మళ్లీ కూలీలతో చల్లించాక పురుగుమందులు కూడా కొట్టాల్సి వస్తుందన్నారు. ఈ సంవత్సరం మినుము పంటను రెండు సార్లు వేయాల్సి వస్తుందని వాపోతున్నారు. మినుము పంట పొవడంతో కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా మారంది. ఎందుకంటే వారిలో వచ్చే ఫలసాయం ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చును తీసివేయగా, భూ యాజమానికి కౌలు చెల్లించాలి. మెదటి సాగులో రైతులు మిగిలేది పెద్దగా ఏం ఉండదు. అందుకే కౌలు రైతు రెండవ పంటపైనే ఆశలు పెట్టుకుంటారు.