కృష్ణా నది వరద ప్రవాహం వస్తుందని అధికారులు చెప్పడంతో మత్స్యకారులు కరకట్టపైకి చేరుకున్నారు. కొంతమంది ఇళ్లలోనూ బిక్కుబిక్కుమంటూ రాత్రంతా విష పురుగుల మధ్య గడిపారు. తుళ్లూరు మండలంలో 117 ఎకరాలలో అరటి, 150 ఎకరాలలో పసుపు, 120 ఎకరాలలో కూరగాయలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గత ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్లను వైకాపా సర్కార్ పంపిణీ చేసి ఉంటే ఈ కష్టాలు తప్పి ఉండేవని మత్స్యకారులు వాపోయారు.
కృష్ణమ్మ వరదకు ఊళ్లు చెరువులయ్యాయి.. పంటలు నీటి పాలయ్యాయి - కృష్ణా నది వరద ప్రవాహం తాజా వార్తలు
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో కృష్ణా నది ఉద్ధృతికి వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, వెంకటపాలెంలోని మత్స్యకార కాలనీలు నీట మునిగాయి.
heavy krishna river floods to tulluru mandal in gunturu