ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్ధృతంగా కొండవీటి వాగు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం - updates of kondaveeti vagu

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుంటూరు జిల్లాలోని కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగు దాటేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

heavy floods at kondaveeti vagu
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కొండవీటి వాగు

By

Published : Aug 31, 2021, 6:37 PM IST

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కొండవీటి వాగు

గత కొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు గుంటూరు జిల్లాలోని కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు పొంగి మోకాళ్ల లోతుకుపైగా నీటితో ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటుగా వెళ్లే వాహనదారులు, పాదాచారులు తీవ్ర అవస్థలు పడ్డారు.

తుళ్లూరు మండలం పెదపరిమి, మంగళగిరి మండలం నీరుకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంగళగిరి నుంచి నెక్కల్లు, పెదపరిమి, అనంతవరం గ్రామాలకు వెళ్లాల్సిన బస్సులు నిలిచిపోయాయి. పెదపరిమి, నీరుకొండలోని వరి పొలాలు నీట మునిగాయి. పత్తి, మిర్చి, పొలాలు నీటిలోనే నానుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details