ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బారులు తీరిన జనాలు.. కానరాని కొవిడ్ నిబంధనలు - no covid rules at Aadhar service center in guntur district

ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్​కు ఫోన్​ నంబర్ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆధార సేవా కేంద్రాలకు ప్రజల తాకిడి భారీగా పెరిగింది. మరికొందరూ ఫోన్​ నంబర్ లింక్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్పంది పడుతున్నారు. అయితే ఎక్కడా కొవిడ్ నిబంధనలు కనిపించడం లేదు.

ఆధార్​ సేవా కేంద్రం వద్ద బారులు తీరిన జనాలు
ఆధార్​ సేవా కేంద్రం వద్ద బారులు తీరిన జనాలు

By

Published : May 25, 2021, 9:08 PM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు ఆధార్​ సేవా కేంద్రానికి పలు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్​కు ఫోన్​ నంబర్ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించడంతో ఆధార్​ సేవా కేంద్రాలకు ప్రజల తాకిడి పెరిగింది.

కొవిడ్​ నిబంధనలు పాటించే విధంగా కేంద్రం నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. జనాలు గుంపులు గుంపులుగా ఉండటం వల్ల కరోనా వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉందని పలుపురు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details