గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే పట్టణంలో 3, నవులూరులో 4, కేసులు నమోదయ్యాయి. పట్టణానికి చెందిన ఓ గర్భిణీ, ఓ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ కూతురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. నవులూరులో నాలుగు కేసులు వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో రాకపోకలను నిషేధించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
మంగళగిరిలో విస్తరిస్తోన్న కరోనా... ఒకేరోజు ఏడు కేసులు నమోదు - మంగళగిరి నేటి వార్తలు
గుంటూరు జిల్లాపై కరోనా తన ఉగ్రరూపాన్ని చూపుతోంది. కేవలం మంగళగిరిలోనే ఏడు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసుల పెరుగుదలతో అధికారులు అప్రమత్తమై సంబంధిత ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
మంగళగిరిలో విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి