కారు మబ్బులు మురిసే... వర్షంతో నెల తడిసే! - గుంటూరు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కారు మబ్బులు పరుగులు తీశాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. కారు మేఘాలతో చిమ్మచీకట్లు అలుముకున్నాయి.
heavy_clouds_in_gunturu
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆకాశంలో భారీగా మేఘాలు పరుగులు తీసుకుంటూ ప్రజలను కనువిందు చేశాయి. కాసేపటికి ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు, వట్టిచేరుకూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. రైతన్నలు వర్షం కురవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.