గుంటూరు జిల్లా నరసారావుపేటలో 4 రోజుల క్రితం జీనేపల్లి తిరుపతయ్య(46) అనే వ్యక్తి గుండె జబ్బుతో బాధ పడుతూ శ్రీ దత్త ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం చేరాడు. రోగికి ఎటువంటి ఇబ్బంది లేదని, బాగుచేస్తామని చెప్పి సుమారు లక్షన్నర వరకూ ఫీజు వసూలు చేశారని మృతుడి బంధువులు చెప్పారు. వాల్స్‌కు రెండు స్టంట్స్ వేసి చికిత్స చేశామని తెలిపిన వైద్యులు చివరకు రోగి మృతదేహాన్ని అప్పగించారుని ఆవేదన చెందారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ వ్యక్తి మృతి చెందాడని బంధువులు... వైద్యశాల ఎదుట బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు వైద్యశాల వద్దకు చేరి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మృతుని బంధువులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.
వైద్యం పేరుతో చంపేశారంటూ.. బంధువుల ఆందోళన - narsarao peta
గుండె జబ్బుతో బాధపడుతూ, వైద్యం కోసం ప్రయివేటు ఆసుపత్రిలో చేరితే చివరకు శవంగా తిరిగొచ్చాడు జీనేపల్లి తిరుపతయ్య. లక్షన్నరకు పైగా ఫీజూ వసూలుచేసి ,చికిత్స చేశామని చెప్పిన వైద్యులే ఈ మరణానికి కారణమని బంధువులు ఆరోపించారు. ఆందోళన చేశారు.
ప్రయివేట్ వైద్యశాలలో రోగి మృతి. బంధువుల ఆందోళన.