ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి రైతుల పాదయాత్ర.. ప్రభుత్వ పిటిషన్​పై విచారణ రేపటికి వాయిదా - ఏపీ తాజా వార్తలు

High Court
హైకోర్టులో

By

Published : Oct 27, 2022, 1:15 PM IST

Updated : Oct 27, 2022, 8:11 PM IST

13:10 October 27

రైతులు, ప్రభుత్వం వేసిన పిటిషన్లను కలిపి విచారించిన హైకోర్టు

Amaravati Farmers Padayatra issue in High Court: అమరావతి రైతుల మహా పాదయాత్రపై కోర్టు ఆంక్షల సవరణ కోసం రైతులు.. పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చడంతో తమ వాదననూ వినిపించడానికి మంత్రి అమర్నాథ్‌రెడ్డి కోర్టుకు రావడంతో హైకోర్టులో హైడ్రామా నడిచింది. దాంతో పాటు పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్ కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు పిటిషన్‌లు విచారించిన న్యాయస్థానం.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అనే సందిగ్ధత అందరిలోనూ నెలకొంది.

పోలీసుల ఆంక్షలతో పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన రాజధాని రైతులు.. హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అలానే పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కలిపి హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి నుంచి అరసవల్లికి చేపట్టిన పాదయాత్రపై ఆంక్షలు తొలగించాలని.. రాజధాని రైతులు న్యాయస్థానాన్ని విన్నివించారు. పాదయాత్రలో రైతులు 600 మంది మొదటి నుంచి చివరవరకూ పాల్గొనడం కష్టమని,.. రొటేట్ అవుతూ ఉంటారని... రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. మహిళలు ఎక్కువ మంది ఉండటంతో..వారి సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలని రాజధాని రైతుల తరఫు న్యాయవాదులు కోరారు. పోలీసుల ఆంక్షలు వల్ల పాదయాత్రను బలవంతంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, అందువల్ల వెంటనే విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. పాదయాత్రలో పాల్గొనే వారికి సంఘీభావం తెలిపే వారు ముందు, వెనుక ఉండేలా అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

డీజీపీ కార్యాలయం 6వందల మందికీ ఐడీ కార్టులు ఇవ్వలేదని.. 150 మందికి మాత్రమే ఇచ్చారని కోర్టుకు తెలిపినట్లు ఐకాస నేతలు తెలిపారు. తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తుందనే ఆశాభావాన్ని రాజధాని ఐకాస నేత పువ్వాడ సుధాకర్‌ వ్యక్తం చేశారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల్ని రైతులు వేసిన కేసులో ప్రతివాదులుగా చేర్చడంతో తమ ప్రాంత వాదననూ వినిపించడానికి కోర్టుకు వచ్చామని.. మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రజా ప్రతినిధులుగా తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలు చెప్పకుండా ఎలా ఉంటామని.. అమర్నాథ్ ప్రశ్నించారు.

రైతుల పిటిషన్​నూ విచారించి హైకోర్టు:అమరావతి రైతుల పాదయాత్రను ఆపాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్, ఆంక్షలు సవరించాలన్న రైతుల పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. కేవలం 150 మందికి మాత్రమే పోలీసులు ఐడీ కార్టులు ఇచ్చారని... రైతులు తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను రెగ్యులర్ కోర్టులో మంగళవారం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

పోలీసుల ఆంక్షలతో పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన రాజధాని రైతులు.. హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అలానే పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కలిపి హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి నుంచి అరసవల్లికి చేపట్టిన పాదయాత్రపై ఆంక్షలు తొలగించాలని.. రాజధాని రైతులు న్యాయస్థానాన్ని విన్నివించారు. పాదయాత్రలో రైతులు 600 మంది మొదటి నుంచి చివరవరకూ పాల్గొనడం కష్టమని, రొటేట్ అవుతూ ఉంటారని... రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. మహిళలు ఎక్కువ మంది ఉండటంతో..వారి సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలని రాజధాని రైతుల తరఫు న్యాయవాదులు కోరారు. పోలీసుల ఆంక్షలు వల్ల పాదయాత్రను బలవంతంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, అందువల్ల వెంటనే విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. పాదయాత్రలో పాల్గొనే వారికి సంఘీభావం తెలిపే వారు ముందు, వెనుక ఉండేలా అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

పోలీసులు 6వందల మందికి ఐడీ కార్టులు ఇవ్వలేదని... 150 మందికి మాత్రమే ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్లు ఐకాస నేతలు తెలిపారు. తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తుందనే ఆశాభావాన్ని రాజధాని ఐకాస నేత పువ్వాడ సుధాకర్‌ వ్యక్తం చేశారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల్ని రైతులు వేసిన కేసులో ప్రతివాదులగా చేర్చడంతో... తమ ప్రాంత వాదననూ వినిపించడానికి కోర్టుకు వచ్చామని.. మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రజా ప్రతినిధులుగా తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలు చెప్పకుండా ఎలా ఉంటామని.. అమర్నాథ్ ప్రశ్నించారు.

రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను రెగ్యులర్ కోర్టులో మంగళవారం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 27, 2022, 8:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details