అవయవ మార్పిడి నిబంధనలు ఉల్లంఘిస్తే ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించినందుకు విశాఖపట్నంలో శ్రద్ధ ఆసుపత్రి మూసివేశామనీ... నెల్లూరు జిల్లా సింహపురి ఆసుపత్రిపై చర్యలు తీసుకున్నామని వివరించారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో కమిటీ వేసి అవయవ దానంపై ప్రతి 2 నెలలకు సమీక్షించాలని అశోక్ బాబు సూచించారు. ఆసుపత్రి యాజమాన్యాలకు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తే వారిపైనా చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అవయవ మార్పిడిలో అవకతవకలు జరిగితే.. అంతే సంగతి! : ఆళ్లనాని - ఆరోగ్య శాఖ మంత్రి
శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయం వాడీవేడిగా సాగింది. వైద్యఆరోగ్య శాఖామంత్రి ఆళ్లనాని అవయవ మార్పిడి విషయంలో తీసుకున్న కఠిన చర్యలు వివరించారు.
ఆళ్లనాని