ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యులు ఇలా చెప్పారు... చంద్రబాబు అలా అన్నారు - latest news on chandra babu

ఇసుక కొరతపై నిరసన దీక్ష చేస్తున్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చెక్కర, బీపీ అన్నీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయని చెప్పారు. మంచి నీళ్లు తీసుకోమని వైద్యులు కోరగా... తాను దృఢంగా ఉన్నానని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబుకు వైద్యుల పరీక్షలు

By

Published : Nov 14, 2019, 5:24 PM IST

దీక్ష చేస్తున్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు

ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను నిరసిస్తూ... ఉదయం నుంచి నిరసన దీక్ష చేస్తున్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. ఆయనకు చెక్కర, బీపీ అన్నీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయని వైద్యులు తెలిపారు. చెక్కర స్థాయి 143మిల్లీగ్రామ్స్ ఉందన్నారు. మంచి నీళ్లైనా తీసుకోవాలని వైద్యులు చంద్రబాబుకు సూచించగా... అందుకు చంద్రబాబు నిరాకరించారు. తాను దృఢంగానే ఉన్నానని... దీక్ష విరమించే వరకూ ఏమీ తీసుకోనని వైద్యులతో అన్నారు.

ABOUT THE AUTHOR

...view details