గుంటూరు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న షేక్ ఖాజా మొహిద్దీన్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. పేకాట నిర్వాహకుల నుంచి 40 వేల రూపాయలు లంచం తీసుకున్నట్లు అభియోగం నిరూపితం కావటంతో అరెస్ట్ చేసిన అనిశా అధికారులు... రిమాండ్ నిమిత్తం శుక్రవారం విజయవాడ కోర్టులో హాజరు పరచనున్నారు.
లంచం తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ - head constable arrest in chilakaluripet news
లంచగొండిగా మారిన ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. అతను ఓ వ్యక్తి నుంచి 40 వేల రూపాయలు తీసుకున్నట్లు విచారణలో తేలటంతో అ.ని.శా అధికారులు చర్యలు చేపట్టారు.
మార్చి 23న చిలకలూరిపేట పట్టణం శివారు ప్రాంతంలో షేక్ నాగూర్ వలి అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. నాగూర్ వలి ద్విచక్ర వాహనంతో పాటు సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తిరిగి తనకు ఇచ్చేందుకు హెడ్ కానిస్టేబుల్ షేక్ ఖాజా మొహిద్దీన్ 40 వేల రూపాయలు లంచం తీసుకున్నాడని నాగూర్ వలి గుంటూరు అ.ని.శా అధికారులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు... విచారణ నిర్వహించారు. లంచం వ్యవహారం నిజమని తేలటంతో ఆ హెడ్‌కానిస్టేబుల్‌ను అ.ని.శా అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ అ.ని.శా ప్రత్యేక కోర్టులో శుక్రవారం హాజరుపరచనున్నారు.