ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల్లో పోటీ చేస్తాం..రక్షణ కల్పించాలని హైకోర్టుకు గురజాల ఔత్సాహికులు - ap latest political news

గుంటూరు జిల్లా గరజాల నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నలుగురు ఔత్సాహికులు హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన ధర్మాసనం వారికి అనుగుణంగా తీర్పునిచ్చింది.

hc-responds-on-guirajala-four-enthusiasts-who-want-to-contest-in-gurjala-municipal-panchayat-elections
హైకోర్టును ఆశ్రయించిన గురజాల ఔత్సాహికులు

By

Published : Nov 3, 2021, 7:24 AM IST

గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నలుగురు ఔత్సాహికులు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 2 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. పోటీ చేయడానికి వీల్లేదంటూ ప్రత్యర్థులు బెదిరిస్తున్నారని, తమకు పోలీసు రక్షణ కల్పించాలని కాశవరపు వెంకటేశ్‌, కత్తి జ్ఞానమ్మ, షేక్‌ నజీమున్‌, షేక్‌ హమీద్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. వీరు హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ద్వారా లంచ్‌మోషన్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌.. పిటిషనర్లకు తగిన రక్షణ కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, గురజాల పట్టణ సీఐని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details