ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యుల బదిలీలపై హైకోర్టులో పిటిషన్‌... నేడు విచారణ జరిగే అవకాశం - వైద్యుల బదిలీలను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్‌

Transfers issue in health department: వైద్యుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. బదిలీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం జాతీయ వైద్య కమిషన్ నిబంధనలకు విరుద్ధం అని పేర్కొంటూ కర్నూలు వైద్య కళాశాల పీజీ విద్యార్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో బదిలీ చేయకుండా నిలువరించాలని కోరారు.

HC on Health Department
HC on Health Department

By

Published : Mar 3, 2022, 4:32 AM IST

Transfers issue in health department: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని వైద్య కళాశాలల్లో ప్రొఫెనర్లు , అసోసియేట్ ప్రొఫెనర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ జనవరి 28 జారీచేసిన జీవో 40, ఫిబ్రవరి 24 న జారీచేసిన జీవో 128 లను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. బదిలీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం జాతీయ వైద్య కమిషన్ నిబంధనలకు విరుద్ధం అని పేర్కొంటూ కర్నూలు వైద్య కళాశాల పీజీ విద్యార్థి జీవీ సాయి ఫణి శంకర్​తో పాటుగా మరో 36 మంది విద్యార్థులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో బదిలీ చేయకుండా నిలువరించాలని కోరారు. వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్, జాతీయ వైద్య కమిషన్ ఛైర్మన్​ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఒకే స్థానంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న అందరు ఉద్యోగులు తప్పని సరిగా బదిలీ కావాలని జీవోలోని మార్గదర్శకాల్లో పేర్కొన్నారన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ ప్రక్రియ చేపట్టడం చట్టవిరుద్ధమని తెలిపారు. అనాలోచిత చర్య అని పేర్కొన్నారు .

సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం...

సాధారణంగా విద్యా సంస్థల్లో బదిలీలు విద్యా సంవత్సరం చివర్లో చేపట్టాలన్నారు. 1988 లో సాధారణ పరిపాలన శాఖ మెమో జారీచేస్తూ సాధారణ బదిలీలు విద్యా సంవత్సరం మధ్యలో చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో అధ్యాపకులను బదిలీ చేసి, కొత్తవారిని తీసుకొస్తే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అధ్యాపకులకు సైతం ఇబ్బంది కలుగుతుందన్నారు. ప్రభుత్వ జీవోలతో బదిలీ కావాల్సిన ఎక్కువ మంది ప్రొఫెసర్లలో కొంతమంది రెండు మూడు నెలల్లో పదోన్నతి పొందాల్సిన వారున్నారని తెలిపారు. కొంతమంది పదవీ విరమణ చేయాల్సిన వారున్నారని పేర్కొన్నారు. ఇలాంటి దశలో బదిలీ చేయడం వారిని ఇబ్బందికి గురిచేయడమేనన్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టకుండా బదిలీలు నిర్వహించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం అన్నారు. కొంతమంది ఉద్యోగులకు అనుకూలంగా వ్యవహరించాలన్న దురుద్దేశంతో విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు నిర్వహిస్తున్నారన్నారని తెలిపారు. డీఎంసీ సిద్ధం చేసిన జాబితా ప్రకారం 268 మంది ప్రొఫెనర్లు, 164 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 746 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 76 మంది ట్యూటర్లు బదిలీ కావాల్సి ఉందన్నారు. డీఎంఈ కింద మొత్తం 1276, ఏపీవైద్య విధాన పరిషత్ పరిధిలో 2 వేల మంది బదిలీ కానున్నారన్నారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు నేడు విచారణ జరిపే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల కలకలం... సేవలకు అంతరాయం

ABOUT THE AUTHOR

...view details