ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP HC On Election Affidavit: 'కేసులున్న విషయాన్ని గోప్యంగా ఉంచటం నేరానికి పాల్పడటమే' - మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి కేసుపై హైకోర్టు

HC On Leaders Criminal History: ఎన్నికల అఫడవిట్​లో నేర చరిత్రను గోప్యంగా ఉంచే ప్రజాప్రతినిధులకు షాకిచ్చేలా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దాచిపెట్టడం ఎన్నికల ప్రక్రియలో అవినీతి, అక్రమాలకు పాల్పడమేనని తేల్చిచెప్పింది. మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డిపై టీడీపీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఈ మేరకు స్పష్టంచేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 15, 2023, 9:36 AM IST

HC On MLC Srinivasulu Reddy Election Affidavit: ఎన్నికల అఫిడవిట్‌లో కేసులున్న విషయాన్ని.. గోప్యంగా ఉంచే ప్రజాప్రతినిధులకు షాకిచ్చేలా హైకోర్టు.. కీలక తీర్పు ఇచ్చింది. క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దాచిపెట్టడం.. ఎన్నికల ప్రక్రియలో అవినీతి, అక్రమాలకు పాల్పడడమేనని తేల్చిచెప్పింది. 2017లో.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి.. పీడీఎఫ్ తరఫున గెలిచిన యండపల్లి శ్రీనివాసులురెడ్డి.. తనపై క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉందనే విషయాన్ని అఫడవిట్‌లో ప్రస్తావించలేదని.. టీడీపీ నుంచి పోటీచేసి ఓడిన అభ్యర్థి పిటిషన్‌ వేశారు.

ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం శ్రీనివాసులురెడ్డి ప్రాసిక్యూషన్‌కు.. బాధ్యుడని తేల్చిచెప్పింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8-ఏ ప్రకారం(ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధింపు)చర్యలు తీసుకునేలా.. సంబంధిత దస్త్రాలను రాష్ట్రపతికి పంపాలని శాసనమండలి కార్యదర్శిని ఆదేశించింది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పూర్వాపరాలు.. పోలింగ్‌ బూత్‌కు వెళ్లే ప్రతి ఓటరుకు తెలిసి ఉండాలని, నిజాయతీగా వాస్తవాలను వెల్లడించినప్పుడే ఎన్నికల వ్యవస్థలో స్వచ్ఛతకు తావుంటుందని.. హైకోర్టు పేర్కొంది. విద్యావంతులైన వాళ్లు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు.. ఎలాంటి శిక్షా లేకుండా తప్పించుకోవడాన్ని అనుమతించలేమని మాజీ ఎమ్మెల్సీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

2017లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొగ్రసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) తరఫున యండపల్లి శ్రీనివాసులురెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2011లో తనపై నమోదైన క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని శ్రీనివాసులురెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ టీడీపీ తరఫున బరిలోదిగిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి 2017 ఏప్రిల్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసులురెడ్డి ఎన్నిక చెల్లనిదిగా ప్రకటించాలని కోరుతూ.. నామినేషన్​ను అంగీకరించడం చట్టవిరుద్ధమని అన్నారు. తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని కోరారు.

ఈ వ్యాజ్యంపై లోతైన విచారణ జరిపిన న్యాయమూర్తి.. నామినేషన్‌ దాఖలు సమయంలో శ్రీనివాసులురెడ్డి క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని చెప్పడానికి సంశయించడం లేదన్నారు. కేసు విషయాన్ని వెల్లడించకుండా శ్రీనివాసులురెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఆయన నామినేషన్​ను అంగీకరించడమే చట్ట వ్యతిరేకం అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం ఆ ఎన్నిక చెల్లుబాటు కానిదిగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. 2023లో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో.. ఈ పిటిషన్లో పిటిషనర్‌కు ఉపశమనం ఇవ్వలేమన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పాడ్డారా లేదా అనే విషయానికి మాత్రమే పరిమితమయ్యామన్నారు. ఈ క్రమంలో శ్రీనివాసులురెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకునేలా.. సంబంధిత దస్త్రాలను రాష్ట్రపతికి పంపాలని శాసనమండలి కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

దీంతోపాటు 'పటిష్ఠమైన, స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం స్థాపన కోసం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు.. వారి పూర్వ చరిత్రను ఎన్నికల అఫిడవిట్లో 'పెద్ద అక్షరాల్లో' పేర్కొనాలని.. అంతేకాక పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో కనీసం మూడుసార్లైనా ప్రచురితం, ప్రసారం అయ్యేలా చూడాలని న్యాయమూర్తి అన్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల పూర్వాపరాలు పోలింగ్‌ బూత్‌కు వెళ్లే ప్రతి ఓటరుకు తెలిసి ఉండాలన్నారు. ఓటరుకు తన అభ్యర్థి పూర్వ చరిత్ర పూర్తిగా తెలిసినప్పుడే ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛత సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో నిజాయతీగా వాస్తవాలను వెల్లడించినప్పుడే ఎన్నికల వ్యవస్థలో స్వచ్ఛతకు తావుంటుందని.. 'సత్యమేవ జయతే' అనేది కేవలం నినాదంగా మిగిలిపోకూడదని న్యాయమూర్తి స్పష్టంచేశారు.

ABOUT THE AUTHOR

...view details