ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీజీపీ గౌతమ్ కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలి: హైకోర్టు - dgp gowtham on high court

రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్​ను ఈరోజు తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. వివిధ కేసులకు సంబంధించి వాహనాలను జప్తు చేస్తున్న పోలీసులు.. వాటిని తిరిగి యజమానులకు అప్పగించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో వివరణ ఇవ్వాలని తెలిపింది.

court
court

By

Published : Jun 24, 2020, 9:16 AM IST

మద్యం అక్రమ రవాణా చేస్తూ జప్తుకు గురైన వాహనాలను సంబంధిత మెజిస్ట్రేట్ లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ముందు ఎందుకు ఉంచడంలేదో డీజీపీ వివరణ ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు డీజీపీ తమ ముందు ఈరోజు హాజరుకావాలని న్యాయమూర్తి జస్టిస్ జట్టు దేవానంద్ ఆదేశాలు జారీచేశారు. నిబంధనలకు లోబడి మద్యం తీసుకెళ్తున్నప్పటికీ పోలీసులు తమ వాహనాల్ని జప్తు చేశారని, వాటిని విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

సోమవారం ఈ వ్యాజ్యాల పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. డీజీపీని సుమోటో ప్రతివాదిగా చేర్చిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 48, సీఆర్‌పీసీ సెక్షన్ 102 ప్రకారం పోలీసులు ఎందుకు నడుచుకోవడంలేదని కోర్టు నిలదీసింది. జప్తుకు గురైన వాహనాలను మెజిస్ట్రేట్ లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ముందు ఉంచక పోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. పోలీసుల చర్య రాజ్యాంగ విరుద్ధమన్న కోర్టు.. వాహనాల్ని సీజ్ చేసిన అధికారులు చట్ట నిబంధనల్ని ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించింది. ఎండకు ఎండి, వానకు తడిచి వాహనాలు పాడైపోవడానికి బాధ్యులైన అధికారులెవరు? వారిపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని స్పష్టంచేసింది. డీజీపీ నుంచి వివరాలు సేకరించి తమ ముందు ఉంచాలని అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ ను ఆదేశించిన విషయం తెలిసిందే.

తాజాగా జరిగిన విచారణలో ఏజీ వాదనలు వినిపిస్తూ.. జప్తు వాహనాలు కంటైన్‌మెంట్ జోన్లలో ఉండటం వల్ల సంబంధిత అధికారుల ముందు ఉంచలేదన్నారు. వాహనాల్ని మెజిస్ట్రేట్ లేదా ఎక్సైజ్ డీసీ ముందు ఉంచాలని సోమవారం నాడు డీజీపీ శాఖాపరమైన సర్క్యులర్ జారీచేశారన్నారు. కోర్టులో దాఖలైన వ్యాజ్యాలకు సంబంధించిన వాహనాల వివరాలను కనుక్కొని చెబుతామన్నారు. ఏజీ చెప్పిన వివరాలు సమగ్రంగా లేవని అభిప్రాయం వ్యక్తంచేసిన న్యాయమూర్తి .. డీజీపీ హాజరుకు ఆదేశించారు.

ఇదీ చదవండి:త్వరలో సెట్స్​పైకి పూరీ 'జన గణ మన'

ABOUT THE AUTHOR

...view details