ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ జీవో 43పై హైకోర్టులో విచారణ - పీజీ మెడికల్‌ కౌన్సిలింగ్‌ జీవో 43పై పిటిషన్‌ పై విచారణ

పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌కు గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో43ను సవాల్‌ చేస్తూ డాక్టర్‌ అలావెంకటేశం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు జరిగిన విచారణలో కౌన్సెలింగ్‌ లో రిజర్వేషన్‌సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని.. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ పాటించడం లేదని పిటిషన్‌ తరపు న్యాయవాది ధార్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

hc comments on pg medical counseling
hc comments on pg medical counseling

By

Published : May 29, 2020, 5:37 PM IST

పీజీ మెడికల్ కౌన్సెలింగ్​కు గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 43ను సవాల్ చేస్తూ హైకోర్టులో డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిగింది. కౌన్సెలింగ్​లో ఓపెన్ కేటగిరిలో రిజర్వేషన్ విద్యార్ది సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని.. సుప్రీంకోర్టు గైడ్​లెన్స్ పాటించడం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదించారు. ఓపెన్ కేటగిరిలో రిజర్వేషన్ అభ్యర్ధి వేరే కళాశాలలో సీటు పొంది వెళ్లిపోతే.. ఆ ఖాళీని ఓసి అభ్యర్ధితో భర్తీ చేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

కౌన్సెలింగ్​పై నూతన జీవో విడుదల చేశామని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. నూతన జీవోలో పిటిషనర్ కోరిన విధంగా సవరణలు చేశామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఇదే అంశంలో ఓసి అభ్యర్ధి వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను న్యాయస్థానం స్వీకరించింది. తదుపరి విచారణ జూన్ 15 కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా కేసులు..ఒకరు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details