ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హమాలీలకు ఎగుమతి కూలీ డబ్బులు తక్షణమే చెల్లించాలి' - ఎగుమతి కూలీ డబ్బులు చెల్లించాలని హమాలీల డిమాండ్

గుంటూరు రామన్నపేటలోని మార్క్​ఫెడ్ యార్డు జిల్లా కార్యాలయం ఎదుట హమాలీలు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని యార్డుల్లో పనిచేస్తున్న హమాలీలకు చెల్లించాల్సిన ఎగుమతి కూలీ డబ్బులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

హమాలీలకు ఎగుమతి కూలీ డబ్బులు తక్షణమే చెల్లించాలి
హమాలీలకు ఎగుమతి కూలీ డబ్బులు తక్షణమే చెల్లించాలి

By

Published : Mar 22, 2021, 4:46 PM IST

గుంటూరు జిల్లాలోని మార్కెట్ యార్డులో పనిచేస్తున్న తమకు ఎగుమతి కూలీ డబ్బులు తక్షణమే ఇవ్వాలని హమాలీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు రామన్నపేటలోని మార్కెఫెడ్ జిల్లా కార్యాలయం ఎదుట హమాలీలు ఆందోళన చేశారు. వారికి సంఘీభావంగా సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకులు రామారావు, తదితరులు నిరసన లో పాల్గొన్నారు.

2020 - 21 ఏడాదిలో జిల్లాలోని పలు మార్కెట్ యార్డుల్లో చేసిన వివిధ పంటల కొనుగోలు తాలూకా ఎగుమతి డబ్బులు సుమారు రూ. 50 లక్షలు రావాల్సి ఉందని.. వాటి చెల్లింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ నాయకులు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిధులను విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 30 నుంచి మార్కెఫెడ్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details