ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గుంటూరులో జాతీయ మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి' - రాజ్యసభలో జీవీఎల్‌ నరసింహారావు

గుంటూరులో జాతీయ మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు రాజ్యసభలో కోరారు. మిర్చి పంటలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Gvl Narasimha Rao Talked On Chilies at  Rajya Sabha
భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

By

Published : Feb 11, 2021, 12:45 PM IST

గుంటూరులో జాతీయ మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు రాజ్యసభలో కోరారు. అత్యధిక మిర్చి పంట పండించే దేశం భారతదేశమని ఆయన గుర్తుచేశారు. ప్రపంచం ఉత్పత్తిలో 40శాతం మిర్చి భారత్‌లో పండుతుందని.. దేశ ఉత్పత్తిలో వాటాగా ఏపీలోనే 40 శాతం మిర్చి లభ్యమవుతుందని ఆయన అన్నారు.

మిర్చి పంటకు గుంటూరు ప్రధాన కేంద్రమని.. కొత్త వంగడాల అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. మిర్చి పంట కోసం జాతీయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

ఇదీ చూడండి.సర్పంచి పోరులో 80 ఏళ్ల బామ్మ

ABOUT THE AUTHOR

...view details