BJP Leaders comments on YCP: మూడేళ్ల వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప.. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టలేదని తీవ్రంగా విమర్శించారు. గుంటూరులో బీజేపీ జిల్లా కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఆయన పాల్గొన్నారు. ఐటీ రంగం అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన కృషి ఏంటో చెప్పాలని జీవీఎల్ ప్రశ్నించారు.
మూడున్నర సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధేమి లేదు.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. స్థానిక నివాసం ఉండి వెళ్లిన వారి సంఖ్య 8 లక్షలు. ఆంధ్రప్రదేశ్ నుంచి 15 శాతం ఐటీ మ్యాన్‌పవర్ ఉంటే ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 0.1శాతం అంటే ఐటీ పరిశ్రమలు ఇక్కడ కనిపించడం లేదు. ఉన్నవాళ్లను కూడా మీరు తరిమేస్తున్నారు. వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయిన్నారు..అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. గత టీడీపీ పార్టీని కూడా ప్రజలు కోరుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజలకు కచ్చితంగా ప్రత్యామ్నాయం కావాలి. ఆ ప్రత్యామ్నాయం కోసమే బీజేపీ జనసేనతో కలిసి ఓ ప్రయత్నం చేస్తోంది. -జీవీఎల్ నరసింహారావు,బీజేపీ ఎంపీ