రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో భేటి అయ్యారు. మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు జీవీఎల్ ఇవాళ గుంటూరు వచ్చారు. ఆ సమావేశం అనంతరం ఆయన కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లారు. దాదాపు గంటసేపు మాట్లాడారు. భాజపా ఉపాధ్యక్షులు రావెల కిషోర్‌బాబు ఉన్నారు. ఈ సమావేశం మర్యాదపూర్వకంగానే అని పార్టీ నేతలు తెలిపారు.
కన్నా లక్ష్మీనారాయణతో జీవీఎల్ భేటీ - AP BJP Latest news
భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు.. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు. పార్టీ ఉపాధ్యక్షులు రావెల కిషోర్‌బాబు పాల్గొన్నారు.
కన్నా లక్ష్మీనారాయణతో జీవీఎల్ భేటీ