గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాల తొలగింపులో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి పాత్ర ఉందని.. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు.. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకుండా అడ్డుపడుతున్నారని ఆంజనేయులు విమర్శించారు. ఎమ్మెల్యే బొల్లా వేధింపులు తట్టుకోలేక ఇద్దరు నాయకులు గుండెపోటుతో చనిపోయారని పేర్కొన్నారు. ఇంకా ఎంత మందిని బలితీసుకుంటారని ప్రశ్నించారు. వినుకొండ, జాల్లపాలెం వద్ద ఎమ్మెల్యే పొలంలో ఉన్న ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. పేదలకు మంజూరు అయిన టిడ్కో ఇళ్లు పూర్తిచేసి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
'విగ్రహాల తొలగింపులో ఎమ్మెల్యే పాత్ర ఉంది' - Guntur district latest news
వైకాపా నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. వినుకొండ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే పట్టణంలో ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను తొలగించారని ఆరోపించారు.

'విగ్రహాల తొలగింపులో ఎమ్మెల్యే పాత్ర ఉంది'