వినుకొండలో ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగింపుపై తెదేపా జిల్లా అధ్యక్షుడు, వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేని విగ్రహాలు చాలా ఉండగా ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలు తొలగించడంపై నగర కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారని జీవి ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారులను అడ్డం పెట్టుకుని విగ్రహాలను తొలగించే కుట్ర చేస్తుందని విమర్శించారు. దీనిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. దళిత డాక్టర్ సోమ్లా నాయక్‌పై ప్రభుత్వ వేధింపులను తప్పుబట్టారు. అంతర్వేదిలో రథం తగలబడిన సంఘటనపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడం ప్రజా విజయమని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు.
'ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగింపుపై అధికారుల అత్యుత్సాహం' - Guntur TDP Latest news
వినుకొండలో అనుమతులు లేని విగ్రహాలు ఎన్నో ఉన్నా... ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలను తొలగించడంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. అధికారులను అడ్డుపెట్టుకొని వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

జీవీ ఆంజనేయులు