టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి అరెస్టును తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఖండించారు. అచ్చెన్నాయుడి గొంతు నొక్కడానికి ఈ ప్రయత్నం చేశారని ఆక్షేపించారు. వైకాపా ప్రభుత్వం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకపోవడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పూర్తికాకుండా ఎలా అరెస్టు చేస్తారని..., ఇది కక్షసాధింపు కాదా అని జీవీ ఆంజనేయులు నిలదీశారు.
'వైకాపా ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది' - latest news on achennaidu
అచ్చెన్నాయుడి గొంతు నొక్కడానికే అరెస్టు చేశారని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆరోపించారు. విచారణ పూర్తికాకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
అచ్చెన్నాయుడు అరెస్టుపై జీవీ ఆంజనేయులు