గుంటూరు తెదేపా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవి ఆంజనేయులు మాట్లాడారు. చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటమే ప్రధాన లక్ష్యంగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు పని చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల గురించి జగన్ మాట్లాడకపోవడం సరికాదన్నారు. కేసీఆర్ సలహాతో చంద్రబాబుపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు భద్రత తగ్గించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రజావేదికను ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటే బాగుండేదన్న జీవి... రాజధాని నిర్మాణంలో తప్పులు జరిగాయని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ సలహాతో చంద్రబాబుపై కుట్ర: జీవి - GV Anjaneyulu
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ట్రాప్లో చిక్కుకున్నారని తెదేపా నేత జీవి ఆంజనేయులు విమర్శించారు. కేసీఆర్ ఆడించినట్లు జగన్ ఆడుతున్నారన్న జీవీ... చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలే లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ సలహాతో చంద్రబాబుపై కుట్ర: జీవి