ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పనికిరాని భూమి పేదలకు.. హైవే పక్కన భూమి బొల్లాకా..' - వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డ జీవీ ఆంజనేయులు

పేదలకు ఇళ్ల స్థలాలు పేరుతో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కోట్లాది రూపాయలు దోచుకున్నారని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. పేదల ఇళ్ల స్థలాల అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రైతులకు వైకాపా ప్రభుత్వం ద్రోహం చేస్తుందని జీవీ విమర్శించారు.

Gv Anjaneyulu
మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

By

Published : Jun 12, 2021, 3:50 AM IST

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో కొండల్లో, గుట్టల్లో పురప్రజలకు చిరునామాలు మార్చే ఇళ్ల స్థలాలు మాకు వద్దని ప్రజలు చెబుతున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు, ఉన్నతాధికారులకు కనపడ లేదా అని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.

ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎకరం 4 లక్షలకు కొనుగోలు చేసి.. 100 ఎకరాలు 18 కోట్లకు ప్రభుత్వానికి అంటగట్టి.. అదే డబ్బుతో మార్కాపురం రోడ్డు హైవే పక్కన వంద ఎకరాలు కొనుగోలు చేసి పేదలకు అన్యాయం చేశారన్నారు. పేదల ఇళ్ల స్థలాలకు భూమి దొరకలేదు అంటూ నాడు ఎమ్మెల్యే కొండల్లో, గుట్టల్లో ఉన్న పనికిరాని తన భూమిని పేదల ఇళ్ల స్థలాలకు ఇచ్చి గొంతు కోశారని జీవీ ఆరోపించారు. మార్కాపురం రోడ్​లో హైవే పక్కన తన సొంతానికి కొనుగోలు చేసిన భూమిని పేద ప్రజల ఇళ్ల స్థలాలకు ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించాడు. రూ 1.80 లక్షలతో పేదల ఇంటి నిర్మాణం ఎలా సాధ్యపడుతుందని నిలదీశారు. ఉచిత ఇసుక, రాయితీతో సిమెంటు, ఇటుకలు, ఇనుము అందిస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఒక్కొక్క పేదవాని గృహ నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని జీవీ డిమాండ్ చేశారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం విఫలం

రెండేళ్ల వైకాపా పాలనలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. తెదేపా పాలనలో చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ చూపి.. 65 వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదించి 23 ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు 70 శాతం పూర్తి చేస్తే.. జగన్ రెడ్డి పాలనలో ఆ ఊసే లేదన్నారు.

రెండేళ్ల పాలనలో కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని.. ఇలా చేస్తే 30 సంవత్సరాల కూడా ప్రాజెక్టులు పూర్తికావని జీవీ దుయ్యబట్టారు. వెలిగొండ, గాలేరు-నగరి ప్రాజెక్టులు అటకెక్కియన్నారు. తెదేపా తరపున రైతులకు అండగా నిలిచి.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు పోరాటం చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

Alapati On Jagan: 'ఆ విషయంలో సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు'

ABOUT THE AUTHOR

...view details