మాజీ స్పీకర్, తెదేపా ముఖ్య నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణం పార్టీకి తీరని లోటని పార్టీ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. గుంటూరు జిల్లా నరసారావు పేటలోని కోడెల కుటుంబ సభ్యులను తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాతో కలిసి పరామర్శించారు. శివప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కోడెల సంస్మరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు.
కోడెల సంస్మరణ సభకు భారీగా తరలిరండి: తెదేపా - gv anjaneyula
నరసారావుపేటలో సోమవారం జరగనున్న మాజీ సభాపతి కోడెల సంస్మరణ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు.
కోడెల సంస్మరణ సభకు భారీగా తరలిరండి: గుంటూరు తెదేపా నేతలు