ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ మెప్పుకోసమే విగ్రహాలు తొలగించారు: జీవీ ఆంజనేయులు - gv anjenyulu comments on jagan news

గుంటూరు జిల్లా వినుకొండ నగరంలో కారంపూడి రోడ్డులో ఎన్​ఎస్పీ కల్వర్టుపై నిర్మించిన విగ్రహాల తొలగింపు ప్రక్రియలో తనపై ఆరోపణలు చేయడం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి తగదని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు.

జగన్ మెప్పుకోసమే బొల్లా విగ్రహాలు తొలగించారు:జీవీ ఆంజనేయులు

By

Published : Sep 14, 2020, 11:13 PM IST

ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలు తొలగింపుపై కోర్టుకు వెళ్లిన ఏడుకొండలుతో జీవీ ఆంజనేయులుకుమ్మక్కయ్యారని బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఈ మాటలను జీవి ఆంజనేయులు ఖండించారు. నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారని జీవీ ఆరోపించారు. అనుమతి లేని, రోడ్డుకి అడ్డంగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలను వదిలి కేవలం ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించడం రాజకీయ లబ్ధి కోసమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ఎజెండాగా పెట్టుకొని చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి మెప్పుకోసం బొల్లా బ్రహ్మనాయుడే అధికారులను అడ్డం పెట్టుకుని వినుకొండలో ఎన్టీఆర్ , పరిటాల విగ్రహాలు తొలగించారని ఆరోపించారు.

వైయస్సార్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రమంతటా దళితులపై దాడులు జరుగుతున్నాయని జీవీ పేర్కొన్నారు. వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామంలో ట్రాక్టర్ అడ్డు తీయమని అడిగినందుకు పెద్దిరెడ్డి బాబు, అతడి తల్లి వెంకటరత్నం అనే దళితులపై గోవిందా రెడ్డి, బాలిరెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దళితులపై గుంటూరు జిల్లాలో జరుగుతున్న దాడులను ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details