తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి తరలిస్తున్న రూ.5 లక్షలు విలువైన గుట్కా బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా విజయపురి సౌత్ సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద సోమవారం వీటిని పోలీసులు గుర్తించారు.
స్థానిక ఎస్సై.. పాల్ రవీందర్ తన సిబ్బందితో నాగార్జున సాగర్ సరిహద్దు చెక్ పోస్టు దగ్గర వాహనాలను తనిఖీ చేశారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి మాచర్ల వైపు వస్తున్న ట్రక్ ను తనిఖీ చేశారు. ఇద్దరు వ్యక్తులు రూ. 5లక్షలు విలువ గల 26 బ్లూ బుల్ ఖైనీ ప్యాకెట్ల బస్తాలు తరలిస్తున్నట్టు గుర్తించారు. అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. సరకును, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.