ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురుకుల పాఠశాలల కార్మికుల అరెస్టు - Gurukul school workers arrested at tadepalli updates

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని.. గుంటూరు జిల్లా తాడేపల్లి సాంఘిక సంక్షేమ కార్యాలయ ముట్టడికి యత్నించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

gurukul
గురుకుల పాఠశాలల కార్మికుల అరెస్టు

By

Published : Apr 19, 2021, 2:26 PM IST

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని.. గుంటూరు జిల్లా తాడేపల్లి సాంఘిక సంక్షేమ కార్యాలయ ముట్టడికి వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కరెంటు బిల్లుల చెల్లింపులు, కూరగాయలు, సరకులు నిలిచిపోవడంతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సుమారు 10 నెలలకు పైగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details