ఈ నెల 27న గుంటూరు బ్రాడీపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో.. జాషువా 125వ జయంతి సభ జరుగుతుందని శాసన మండలి సభ్యుడు లక్ష్మణరావు తెలిపారు. పలువురికి జాషువా కవితా పురస్కారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, యస్.యస్.ఎన్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ కాకాని సుధాకర్, కళాభూషణ్ బి.వేడయ్య తదితరులు హాజరవుతున్నారన్నారు. ఆన్లైన్లో జరిగే ఈ సభలో ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఆన్లైన్ వేదికగా గుఱ్ఱం జాషువా 125వ జయంతి - గుఱ్ఱం జాషువా 125వ జయంతి వార్తలు
ఈ నెల 27న ఆన్లైన్లో జరిగే గుఱ్ఱం జాషువా 125వ జయంతి సభను జయప్రదం చేయాలని శాసన మండలి సభ్యుడు కె.ఎస్.లక్ష్మణరావు కోరారు. జాషువా సాహిత్యాన్ని విరివిరిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.
![ఆన్లైన్ వేదికగా గుఱ్ఱం జాషువా 125వ జయంతి ఆన్లైన్ వేదికగా జాషువా 125వ జయంతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8811633-691-8811633-1600182246680.jpg)
ఆన్లైన్ వేదికగా జాషువా 125వ జయంతి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా సమాజంలో కుల వివక్ష, దళితులపై దాడులు, అంటరానితనం, మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. జాషువా తన సాహిత్యంలో ఇలాంటి రుగ్మతలకు వ్యతిరేకంగా రచనలు చేశారన్నారు.