ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్రం జాషువా 125వ జయంతి వారోత్సవాలు - Gurram Jashuva 125th Anniversary Celebrations news

ఉత్తమ కవి, అత్యుత్తమ మహోన్నతావాది గుర్రం జాషువా 125వ జయంతిని పురస్కరించుకుని...నేటి నుంచి ఈనెల 28 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.

గుర్రం జాషువా
గుర్రం జాషువా

By

Published : Sep 22, 2020, 4:10 PM IST

కవి చక్రవర్తి గుర్రం జాషువా 125వ జయంతిని పురస్కరించుకుని...నేటి నుంచి ఈనెల 28 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గుంటూరు నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్సీ నివాళులర్పించారు. వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.

సిస్కో వెబెక్స్ అనే యాప్ ద్వారా అంతర్జాల వేదికగా జాషువా 125వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 28న ప్రభుత్వ లాంఛనాలతో జాషువా జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో ఏర్పడే నూతన జిల్లాకు గుర్రం జాషువా జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జాషువా వారోత్సవాలలో కళాభిమానులు, జాషువా అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని డొక్కా కోరారు.

ఇదీ చదవండి:

వివేకా హత్య కేసులో మరో ముగ్గురు అనుమానితుల విచారణ

ABOUT THE AUTHOR

...view details