దాచేపల్లి మండలం నడికుడి గ్రామం క్వారీ వివాదంలో గాయపడి... గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తమ్మిశెట్టి నీలకంఠ మృతదేహాన్ని... గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసు రత్నం సందర్శించారు. నీలకంఠ కుటుంబానికి రూ. 2.5 లక్షల నగదును అందించారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చికిత్స పొందుతున్న మరో ముగ్గురుని పరామర్శించారు. క్వారీ వివాదంలో యువకుడి మృతి చెందడం బాధాకరమని గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు.
మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ.. రూ.2.5 లక్షల ఆర్థిక సాయం - dachepalli news
క్వారీ వివాదంలో మృతి చెందిన గుంటూరు జిల్లా నడికుడి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి నీలకంఠ కుటుంబానికి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రూ.2.5 లక్షల నగదు ఆర్థిక సాయం చేశారు.
మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ