అద్దంకి-నార్కెట్‌పల్లి టోల్ ప్లాజా యాజమాన్యమైన నామ్(నార్కెట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల) ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ సంస్థ బైపాస్ పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తుందని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల పట్టణానికి చెందిన 6 కిలోమీటర్ల బైపాస్ పనులు, పట్టణంలోని రహదారి పూర్తి మరమ్మతులు త్వరతగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
తుమ్మలచెరువు టోల్ ప్లాజా దిగ్బంధిస్తాం: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి - పిడుగురాళ్ల బైపాస్ చేపట్టాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల బైపాస్ పనులు, పట్టణంలోని రహదారి మరమ్మతులు త్వరతగతిన పూర్తి చేయాలని నామ్ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ సంస్థను గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక ప్రకటించాలని లేనిపక్షంలో తుమ్మలచెరువు టోల్‌ప్లాజా దిగ్బంధం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.
పదేళ్లుగా పిడుగురాళ్ల బైపాస్ పనులు చేపట్టకుండా తుమ్మలచెరువు హైవే వద్ద నున్న టోల్ ప్లాజాలో వాహనాల వద్ద డబ్బు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. నామ్ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ సంస్థ పిడుగురాళ్ల బైపాస్ పనులపై నిర్దిష్ట ప్రణాళిక త్వరగా ప్రకటించకపోతే వచ్చే 29వ తేదీన తుమ్మలచెరువు హైవే వద్దనున్న టోల్ ప్లాజాను దిగ్బంధం చేసి, ధర్నాకు దిగుతామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి :గుంటూరు వైద్యుల ఘనత: అవతార్ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స