గుంటూరు జిల్లా అడిగొప్పులలో మీ సేవా కేంద్రం నిర్వాహకుడు గంటా శ్రీనివాసులు హత్య జరిగిన ప్రాంతాన్ని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు పరిశీలించారు. ఘటన జరిగిన తీరు గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాసులు కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. పొలం తగాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుని.. చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలిపారు.
హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన గురజాల డీఎస్పీ - అడిగొప్పుల నేర వార్తలు
గుంటూరు జిల్లా అడిగొప్పులలో హత్య జరిగిన ప్రాంతాన్ని స్థానిక డీఎస్పీ పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుని, శిక్షిస్తామని హెచ్చరించారు.
హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన గురజాల డీఎస్పీ