గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలు కేసుల విచారణలో అలక్ష్యంగా వ్యవహరించటం ఇద్దరి సస్పెన్షన్‌కు కారణమని పోలీసువర్గాలు చెబుతున్నా.. అంతర్గతంగా రాజకీయ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి ఫోన్ కాల్ డేటాను మరో ప్రజాప్రతినిధికి అందించారని... సదరు ప్రజాప్రతినిధి డీజీపీకి ఫిర్యాదు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డేటాను అనధికారికంగా ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు ఇద్దరిపైనా వేటు వేసినట్టు భావిస్తున్నారు.
గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు - గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్‌పై సస్పెన్షన్
గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్‌లో రాజకీయ కోణం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి ఫోన్ కాల్ డేటా విషయంలో వివాదమే సస్పెన్షన్‌కు కారణంగా పలువురు భావిస్తున్నారు.
గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు