గుంటూరు జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 29 వేల కోట్లు - గుంటూరు
గుంటూరు జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ విడుదల చేశారు. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 29 వేల 400 కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్ణయించారు.
gunturu_yearly_planning_budget
గుంటూరు జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 29 వేల 400 కోట్ల రూపాయలను లక్ష్యంగా నిర్ణయించారు. ప్రాథమిక రంగానికి 21 వేల 400 కోట్లను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. గతేడాది నిర్దేశించిన 25వేల 540 కోట్ల రుణ ప్రణాళికలో 103 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. రైతులు, కౌలు రైతులకు విరివిగా రుణాలు అందించేలా బ్యాంకర్ల సాయంతో కృషి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.