అమరావతి ఐకాస, రాజకీయపక్షాలు చేపట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రకటించారు. ఆందోళనల నేపథ్యంలో ఆయన జైలు వద్దే ఉండి ఉద్రిక్తతలు సద్దుమణిగే వరకూ పరిస్థితిని సమీక్షించారు. జైల్ భరో కార్యక్రమంలో పాల్గొని ప్రజా జీవనానికి ఆటంకం కలగించినందుకు వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆందోళనలకు అనుమతి లేదని చెప్పినా వారు జైలు వద్దకు రావటం సరికాదని చెప్పారు. 150మందిని అరెస్టు చేశామని... వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారని.. వారిని మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. అరెస్టైన వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.
అరెస్టైన వారిపై కేసు నమోదు చేస్తాం: ఎస్పీ అమ్మిరెడ్డి - చలో గుంటూరుపై ఎస్పీ అమ్మిరెడ్డి కామెంట్స్
జైల్ భరోకు ఎలాంటి అనుమతి లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. కొవిడ్ నిబంధనల మేరకు ముఖ్య నేతలను గృహ నిర్బంధించామని తెలిపారు.

అరెస్టైన వారిపై కేసు నమోదు చేస్తాం: ఎస్పీ అమ్మిరెడ్డి