మిర్చి రైతుకు మెరుగైన ధర: ఏసురత్నం - guntur mirchi yard latest news
రైతులు పండించిన మిర్చి పంటకు మెరుగైన ధర వచ్చేలా చేయటంతో పాటు... సులువుగా విక్రయించుకునేలా చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్ ఏసురత్నం తెలిపారు. లాక్ డౌన్ కారణంగా మూతపడిన యార్డుని తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేందుకు మార్కెట్ కమిటీ, మిర్చి యార్డు అధికారులు, వ్యాపారులు కూలీలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే యార్డు కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ఏసురత్నం వెల్లడించారు.
గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి