కరోనా మూడో విడత వ్యాప్తికి అవకాశాలున్న తరుణంలో గుంటూరు జీజీహెచ్ లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 120 పడకలు జీజీహెచ్లో అందుబాటులో ఉండగా... మరో 20 ఐసీయూ బెడ్స్ ను సిద్ధం చేస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి చెప్పారు. పసిపిల్లల కోసం ప్రత్యేకంగా వెంటిలేటర్స్ ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చిన్నారులకు అవసరమయ్యే మందుల కొరత లేకుండా చూస్తామన్నారు.
కరోనా మూడో విడత దృష్ట్యా.. జీజీహెచ్లో ముందస్తు చర్యలు - గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి న్యూస్
కరోనా మూడో విడత వ్యాప్తి హెచ్చరికల దృష్ట్యా.. గుంటూరు జీజీహెచ్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా చిన్నారులకు వైరస్ సోకే అవకాశాలున్నాయనే సమాచారంతో అందుకు తగ్గట్లుగా పడకలు సిద్ధం చేస్తున్నారు.
కరోనా మూడో విడత వ్యాప్తి దృష్ట్యా జీజీహెచ్లో ముందస్తు చర్యలు