గుంటూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో అధికారులు పంట నష్టం అంచనాలు వేస్తున్నారని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ వెల్లడించారు. ఈనెలాఖరుకు రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం పడుతుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. మొలకెత్తిన, రంగు మారిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. జిల్లాలో 164 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈనెలాఖరుకు రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం: కలెక్టర్
తుపాను కారణంగా గుంటూరు జిల్లాలో లక్షా 33 వేల హెక్టార్లలో వరిపంట నష్టం జరిగింది. కొన్ని జాగ్రత్తలతో 35 వేల హెక్టార్లలో వరి పంటను కాపాడగలిగామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ తెలిపారు.
ఈనెలాఖరుకు రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం: కలెక్టర్